తెలంగాణ డిజీపీగా శివధర్ రెడ్డి

September 27, 2025
img

తెలంగాణ డిజీపీగా సీనియర్ ఐపీఎస్‌ అధికారి శివధర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా చేస్తున్న జితేందర్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. కనుక ఆయన స్థానంలో 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటలిజెన్స్ డీజీగా చేస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన శివధర్ రెడ్డి మొదట ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం సీపీగా పని చేశారు. ఆ తర్వాత నల్లగొండ ఎస్పీగా, ఏసీబీ ఐజీగా, ఏసీబీ అదనపు డైరెక్టరుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఇంటలిజన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు డీఐజీగా యావత్ పోలీస్ శాఖకు బాస్ అయ్యారు.       


Related Post