గ్రూప్-3 పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఓ ముఖ్య గమనిక. ఈ నెల 18 నుంచి జూలై 18 వరకు అభ్యర్ధుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఒకవేళ అనివార్య కారణాల వలన ఎవరైనా హాజరుకాలేకపోతే వారి కోసం జూలై 9వ తేదీన (ఒక్కరోజు మాత్రమే) సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ఈ ప్రక్రియ చేపడుతామని టీజీపీఎస్సీ తెలియజేసింది.
జూన్ 18 నుంచి ప్రతీరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలియజేసింది.
కనుక అభ్యర్ధులనదరూ ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటన్నటికీ సెల్ఫ్ ఆటస్ట్ చేసిన ఒక సెట్ జిరాక్స్ కాపీలు, రెండు సెట్స్‌లో అటస్టేషన్ ఫారంలు, చెక్ లిస్ట్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపింది. జూన్ 17 నుంచి జూలై 9 వరకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ జరుగుతుంది.
దీనికి సంబందించి పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్ సైట్ సందర్శించవచ్చు.