టీఎస్‌ఎడ్‌సెట్-2024 ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణలోని బీఈడీ కళాశాలలో రెండేళ్ళ బీఈడీ కోర్సులలో ప్రవేశాల కొరకు వీటి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఎడ్‌సెట్ మే 23న జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 29,463 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 96.99 శాతం అంటే 28,549 మంది ఉత్తీర్ణులయ్యారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్, అషిత (హైదరాబాద్) రెండో ర్యాంక్, శ్రీతేజ మూడో ర్యాంక్ సాధించారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీఈడీ కాలేజీలలో కలిపి మొత్తం 14,285 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని ర్యాంక్స్, మార్కులు ఆధారంగా కేటాయిస్తారు.
ఎడ్‌సెట్-2024 ఫలితాలను అధికార వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in/ నుంచి అభ్యర్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఉన్నత విద్యాశాఖ తెలియజేసింది.
అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అయిన తర్వాత ఫలితాలు, ర్యాంక్ కార్డు ఆప్షన్ ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.