నిరుద్యోగుల సమస్యలు నాకు తెలుసు: రేవంత్‌

July 20, 2024
img

తెలంగాణ ప్రభుత్వం ఊహించని విదంగా ఓ కొత్త పధకం ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్ధులకు లక్ష రూపాయలు ఆర్ధికసాయం అందించేందుకు 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరుతో కొత్త పధకాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి శనివారం ప్రజా భవన్‌లో ప్రారంభించారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ పధకాన్ని అమలుచేయబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్ధులతో ముఖాముఖీ సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటారో నాకు బాగా తెలుసని అందుకే ఈ పధకం ప్రవేశపెట్టామని చెప్పారు.  రాష్ట్రం నుంచి అత్యధికంగా మెయిన్స్‌కు అభ్యర్ధులు ఎంపిక కావాలనే సదుదేశ్యంతో ఈ పధకం ప్రారంభించిన్నట్లు సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. తద్వారా తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేయగలుగుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, సిఎస్ శాంతికుమారి, సంబందిత అధికారులు పాల్గొన్నారు. 

Related Post