ఒకటి రెండు రోజులలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ?

February 28, 2024
img

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీకి క్యాలండర్ విడుదల చేసి, 12 నెలలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నామని చెపుతూ, గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన న్యాయవివాదాలని పరిష్కరిస్తూ వరుసపెట్టి నియామక పత్రాలు అందిస్తున్నారు. అలాగే వివిద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తోంది. 

గ్రూప్-1లో 503 పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేసి మరో 60 పోస్టులు కలిపి 563 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వ హయాంలో 5,059 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది కానీ ఎన్నికల కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు చేసింది. 

ఆ పోస్టులకు అదనంగా మరో 5-6,000 పోస్టులు కలిపి సుమారు 10-11,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టిఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. గురు లేదా శుక్రవారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.

Related Post