తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు షురూ

February 28, 2024
img

తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మార్చి 19 వరకు ప్రతీరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 

ఇంటర్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,78,718 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,02,260 మంది కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్దులు హాజరవుతున్నారు.

ఇదివరకు పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా ఇంటర్ బోర్డు పటిష్టమైన చర్యలు చేపట్టింది. 27,900 మంది ఇన్విజిలేటర్లు, 200 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసింది.

ప్రతీ పరీక్షా కేంద్రంలో సిసి కెమెరాలను అమర్చి విద్యార్దులు కాపీలు కొట్టకుండా నిఘా పెట్టింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల జిరాక్స్ షాపులన్నిటినీ మూయించి వేశారు.  

ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్న విద్యార్దుల కోసం టిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. విద్యార్దులు చెయ్యెత్తితే ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆపి వారిని ఎక్కించుకోవాలని టిఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్లను ఆదేశించింది.

Related Post