తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టిఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత తొలిసారిగా సోమవారం గ్రూప్-1లో 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
వీటి కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తులతో పాటు అభ్యర్ధులు రూ.320 ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.
నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులు ఈ ఫీజు చెల్లించనవసరం లేదు. అలాగే 2022లో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. మే-జూన్ నెలల్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్-అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి. దివ్యాంగులకు 10 సం.లు, ప్రభుత్వోద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 5 సం.లు, మాజీ సైనికోద్యోగులకు, ఎన్‌సీసీ అభ్యర్ధులకు 3 సం.లు వయో సడలింపు ఉంటుంది.
గ్రూప్-1లో 563 పోస్టులకు సంబందించి పూర్తి వివరాల కోసం టిఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.