తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఓ శుభవార్త. ఏ కారణం చేతైనా కాలేజీలో చదవలేకపోయిన విద్యార్ధులు కూడా ఇంటర్ పరీక్షలు వ్రాసేందుకు ఇంటర్ బోర్డు అనుమతిస్తోంది. ఈ నెల 20 నుంచి నవంబర్ 18వరకు హాజరు మినహాయింపు కోరుతూ ఇంటర్ బోర్డుకు రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో రూ.200 ఆలస్య రుసుము చెల్లిస్తే నవంబర్ 30వరకు దరఖాస్తు చేసుకొనేందుకు కూడా ఇంటర్ బోర్డు అనుమతిస్తోంది.
ఇంటర్మీడియేట్ ప్రైవేటుగా చదివే విద్యార్ధుల కోసం ఈ వెసులుబాటు కల్పించిన్నట్లు ఇంటర్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. అలాగే ఆర్ట్స్, హ్యూమానిటీస్ గ్రూపు విద్యార్దులకు, సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్, హ్యూమానిటీస్ గ్రూపుకు మారేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించిన్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు.