తెలంగాణ డిఎస్సీ కూడా వాయిదా!

October 13, 2023
img

తెలంగాణ శాసనసభ ఎన్నికల జరుగబోతుండటంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈనవ్ 20-30 తేదీల మద్య జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు కూడా ఇదే కారణం చేత వాయిదా పడ్డాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన నేడు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. మళ్ళీ ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తామో త్వరలోనే తెలియజేస్తామని ఆమె తెలిపారు. 

తెలంగాణలో మొత్తం 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కొరకు సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి అక్టోబర్ 21వరకు దరఖాస్తు స్వీకరిస్తోంది. ఇది ముగిసిన తర్వాత నవంబర్‌ 20 నుంచి 30వ తేదీలోగా నిర్వహిస్తామని తెలియజేసింది.

నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతుండటంతో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. డిసెంబర్‌ 3వ తేదీన ఫలితాలు వెలువడతాయి. డిసెంబర్‌ 5వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. కనుక ఆ తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

Related Post