ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పధకం ప్రారంభం

October 06, 2023
img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు ఉదయం ‘సిఎం బ్రేక్ ఫాస్ట్’ పేరుతో అల్పాహారం అందించే పధకం ప్రారంభం అయ్యింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావులు ఈ పధకాన్ని ప్రారంభించగా, ఇతర జిల్లాలలో ఆయన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ పరిధిలో గల వెస్ట్ మారేడ్ పల్లి పాఠశాలలో మంత్రి కేటీఆర్‌, ఉప్పల్ పాఠశాలలో హోంమంత్రి మహమూద్ అలీ ఈ పధకాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలలో చదువుకొంటున్న 23 లక్షల మంది విద్యార్ధులకు ఇక నుంచి ప్రతీరోజు అల్పాహారం లభిస్తుంది. విద్యార్ధులు బడికి రాగానే ముందుగా వారికి అల్పాహారం పెట్టిన తర్వాత తరగతులు   ప్రారంభిస్తారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో ‘అక్షయపాత్ర’ సంస్థకు ఈ బాధ్యత అప్పగించగా మిగిలిన జిల్లాలలో మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులకే అల్పాహారం తయారుచేసే బాధ్యత కూడా అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.


Related Post