తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ జారీ

September 21, 2023
img

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడగా, ఇప్పుడు పరీక్షల సిలబస్, తేదీలను విద్యాశాఖ ప్రకటించింది.

నవంబర్‌ 20 నుంచి 30 వరకు ప్రతీరోజు డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.  

ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 160 ప్రశ్నలకు 80 మార్కులు పరీక్ష నిర్వహించి మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు. పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 200 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.

 

Related Post