టిఎస్ ఎంసెట్ చివరి కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ

October 18, 2022
img

తెలంగాణ ఎంసెట్ చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. యుజి ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఈనెల 21వ తేదీన స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మర్నాడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, అదే రోజు నుంచి అక్టోబర్‌ 23వరకు వెబ్‌ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వాటి ప్రకారం అక్టోబర్‌ 26వ తేదీన అభ్యర్ధులకు ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు కేటాయించబడతాయి. అక్టోబర్‌ 26 నుంచి 28వ తేదీలోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ (సదరు కాలేజీలో చేరబోతునట్లు దృవీకరించడం) చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి వెంటనే కాలేజీకి నిర్దేశిత ట్యూషన్ ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగియగానే అక్టోబర్‌ 27 నుంచి ప్రైవేట్ ఆన్‌ ఎయిడెడ్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీలలో స్పాట్ అడ్మిషన్లకు సంబందించి నిబంధనలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 


Related Post