నిరుద్యోగులకు ఓ శుభవార్త. టాటా కన్సల్టన్సీ సర్వీసస్ (టీసిఎస్) త్వరలో 35-40,000 మంది ఉద్యోగులను భర్తీ చేసుకోబోతోంది. వారిలో అత్యధికంగా కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ ను భర్తీ చేసుకోబోతున్నట్లు ఆ సంస్థ గ్లోబల్ హెచ్ఆర్డీ చీఫ్ మిలిండ్ లక్కాడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలలో క్యాంపస్ సెల్క్షన్ ద్వారా కొత్తవారిని నియమించుకోబోతున్నట్లు తెలిపారు. వారానికి 8 నుంచి 11,000 మందిని ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఫ్రెషర్స్ తో పాటు సాఫ్ట్‌వేర్ నిపుణులను కూడా తీసుకోబోతున్నట్లు తెలిపారు.