ఇక నుంచి ట్రైన్ టికెట్స్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. దీని కోసం అమెజాన్-ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకొన్నాయి. అమెజాన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొన్నవారికి గరిష్టంగా 10 శాతం లేదా రూ.100 వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అదే..అమెజాన్ ప్రైమ్ మెంబర్లకైతే గరిష్టంగా 12 శాతం లేదా రూ.120 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది పరిమితకాలం వరకే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని అమెజాన్ సంస్థ తెలిపింది. ఇప్పటికే అమెజాన్ ద్వారా బస్సు, విమాన టికెట్స్ బుక్ చేసుకొనే సౌకర్యం ఉంది. ఇప్పుడు ట్రెయిన్ టికెట్స్ కూడా వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేవలు అమెజాన్ అండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్స్ ద్వారా మాత్రమే లభ్యమవుతాయి.