మున్సిపల్ ఎన్నికలు ఇంకా ఎప్పుడో?

August 17, 2019


img

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జీహెచ్‌ఎంసీ అధికారుల మాటలలో డొల్లతనం శుక్రవారం హైకోర్టు విచారణలో బయటపడింది. రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలు తదితర అనేక సమస్యలను సరిదిద్దకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం అవుతోందని ఫిర్యాదు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ మొదలు ప్రతీ అంశంపై హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వన్యాయవాదిని గట్టిగా నిలదీసి అడిగారు. ఆయన వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుల వ్యవదిలో వేలాది పిర్యాదులన్నిటినీ ఏవిధంగా పరిష్కరించామని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలోనే కాదు.. కోర్టుకు సమర్పిస్తున్న పత్రాలలో కూడా అధికారుల అశ్రద్ద, అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని చీవాట్లు పెట్టింది. మళ్ళీ ఈనెల 21న విచారణ జరిపినప్పుడు పూర్తి వివరాలతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపద్యంలో సెప్టెంబర్ నెలాఖరుకైన మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.


Related Post