అప్పుడే మొదటి పిటిషన్ దాఖలు

January 10, 2019


img

అగ్రవర్ణాల పేదలకు విద్యాఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుదవారమే పార్లమెంటు ఆమోదించింది. దానిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇంకా ఆమోదముద్ర వేయనేలేదు. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ అప్పుడే మొదటి పిటిషను సుప్రీంకోర్టులో దాఖలైంది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషను వేశారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక విధానాలకు విరుద్దంగా ఉందని, 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వరాదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని, ఆర్ధిక వెనుకబాటుతనం ఆధారంగా    రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని వారు పిటిషనులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వరాదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఈ పిటిషనుపై సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. Related Post