దేశంలో మొట్టమొదటి మహిళా కమెండో టీమ్

August 16, 2018


img

దేశంలో మొట్టమొదటి మహిళా కమెండో టీమ్ ఆగస్ట్ 15వ తేదీన బాధ్యతలు చేపట్టింది. స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) టీమ్ పేరుతో పనిచేసే ఈ మహిళా కమెండోలు నిన్న డిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ సభలో విధులు నిర్వర్తించారు. 

స్వాట్ కమెండో టీమ్స్ ప్రత్యకత ఏమిటంటే వీరికి అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించడంలో శిక్షణ పొందుతారు. నగరాలలో, అడవులలో, కొండలలో ఎక్కడైనా ఉగ్రవాదులు లేదా సంఘవిద్రోహశక్తులు దాడులకు పాల్పడినప్పుడు లేదా ప్రజలు లేదా ప్రముఖులను బందించినప్పుడు ఈ స్వాట్ కమెండోలను రంగంలో దిగుతారు. ఇజ్రాయిల్ దేశపు స్వాట్ కమెండోలకు ‘క్రావ్ మెగా’ అనే  ప్రత్యేక రకమైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతారు. మనదేశపు మొట్టమొదటి స్వాట్ టీమ్ కూడా కరాటేతో సహా క్రావ్ మెగాలో కూడా శిక్షణ పొందారు. కనుక చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకపోయినా వారు శత్రువులపై చురుకుగా దాడి చేసి మట్టుబెట్టగలరు.



Related Post