వైకాపా ఎంపిల రాజీనామాలకు ముహూర్తం ఖరారు

February 13, 2018


img

ఏపిలో వైకాపా ఎంపిల రాజీనామాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసే రోజున అంటే ఏప్రిల్ 6వ తేదీలోగా ఏపికి ప్రత్యేకహోదా మంజూరు చేయకపోతే తమ ఎంపిలు అందరూ రాజీనామాలు చేస్తారని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మార్చి 5న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైనరోజు నుంచి ముగిసే వరకు పార్లమెంటులో ఆందోళన చేస్తామని, కేంద్రం దిగిరాకపోతే, పార్లమెంటు సమావేశాల చివరి రోజున ఎంపిలు అందరూ రాజీనామాలు చేసి ప్రజలలోకి వెళతామని జగన్ ప్రకటించారు. వైకాపాకు ఒక రాజ్యసభ సభ్యుడు (విజయసాయి రెడ్డి) ఐదుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు.Related Post