ఇస్రో జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం

May 29, 2023
img

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) విజయాల జాబితాలో మరో విజయాన్ని నమోదు చేసుకొంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 10.15 గంటలకు ఇస్రో నమ్మిన బంటి జీఎస్ఎల్వీ ఎఫ్-12 ఉపగ్రహనౌక ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని తీసుకొని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. 19 నిమిషాలలో దానిని అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టి, అంతరిక్ష రంగంలో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించింది. 

ఈరోజు ప్రయోగించిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహం దేశీయ నావిగేషన్ అవసరాల కోసం పనిచేస్తుంది. ఇదివరకు పంపిన ఉపగ్రహాలు గడువు ముగియడంతో వాటి స్థానంలో ప్రతీ 6 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 4 నావిగేషన్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది. ఈ ఉపగ్రహం బరువు 2,232 కేజీలు. ఇది ఎల్-5, ఎస్ బ్యాండ్ సిగ్నల్స్ తో పనిచేస్తుంది. భూమి మీద తిరిగే వాహనాలకు, సముద్రాలు, నదులలో ప్రయాణించే పెద్దా చిన్నా షిప్పులకు, అలాగే విమానాలకు గ్లోబల్ పొజిషనింగ్ (జీపీఎస్), దిక్సూచి సేవలు అందిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఉపగ్రహం నావిక్-01 పేరుతో భారత్‌కు రాబోయే 12 ఏళ్ళపాటు సేవలు అందిస్తుంటుంది.

Related Post