అవును చందమామే... కానీ ఇలా ఉందేమిటి?

November 25, 2022
img

భూమ్మీద నుంచి చంద్రుడిని చూస్తే తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. ఇక చిన్నప్పటి నుంచి మనం చందమామ గురించి విన్నవి, కవులు, రచయితలు వర్ణించి వర్ణించి చెప్పినవే చాలానే ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. కానీ చంద్రుడు మనం ఊహించుకొన్నట్లు ఉండదని అందరికీ తెలుసు. అయినప్పటికీ చందమామ కధలు చెప్పుకొంటూనే ఉంటాము... చల్లటి వెన్నెలను ఆస్వాదిస్తూనే ఉంటాము. 

అయితే చంద్రుడి మీదకి ఆర్టెమిస్ వ‌న్ మిష‌న్‌లో భాగంగా అమెరికా పంపిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పంపిన తాజా ఫోటోలను చూస్తే కంగు తినకమానము. చంద్రుడికి 128 కిమీ దూరం నుంచి ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ తీసి పంపిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను నాసా విడుదల చేసింది. ఆ ఫోటోలలో చంద్రుడి ఉపరితలం అంతా చిన్నపాటి నుంచి అతి భారీ గుంతలతో నిండి ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. బహుశః గ్రహశఖలాలు ఢీకొనడం వలన ఆవిదంగా చంద్రుడి ఉపరితలంపై గుంతలు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

చంద్రుడి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు ఇస్రో గురించి కూడా చెప్పుకోవలసిందే. చంద్రుడు నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న మంగళగ్రహం మీదకి భారత్‌ అంతరిక్ష సంస్థ ఇస్రో మంగళ్ యాన్ పేరుతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. అలాగే 2008లో చంద్రయాన్-2 పేరుతో చేసిన ప్రయోగం కూడా విజయవంతమైంది. కానీ 2019, జూలై 22న చేసిన చంద్రయాన్-2 పాక్షికంగా విజయవంతమైంది. దానిలో ఆర్బిటర్ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ (యంత్రం) మాత్రం ల్యాండింగ్ సమయంలో ముక్కలైపోయింది. అయితే నేటికీ ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ విలువైన సమాచారం అందిస్తోంది. మళ్ళీ 2023, జూన్ 23వ తేదీన చంద్రయాన్-3ని ప్రయోగించడానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. 

Related Post