గంగం గణేశాకు ఆనంద్ దేవరకొండ వెరైటీ ప్రమోషన్

May 23, 2024


img

విజయ్‌ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి మళ్ళీ బోర్లాపడి నిలద్రొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటే, అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ విలక్షణమైన కధలతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుండటం విశేషం.

బేబీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాక ‘గంగం గణేశా’ అంటూ మే 31న ప్రక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనుక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సహ నటుడు ఇమ్మానుయేల్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో కారులో తిరుగుతూ కొంత మందిని ఇంటర్వ్యూ చేశారు. 

ఆనంద్ దేవరకొండ తనని ఎవరూ గుర్తుపట్టకుండా టోపీ, కళ్ళద్దాలు, మొహానికి మాస్కు పెట్టుకొని కారు డ్రైవ్ చేస్తుంటే, కారులో ఎక్కించుకున్నవారిని ఇమ్మానుయెల్ చిలిపి ప్రశ్నలు వేస్తూ ఈ ప్రమోషన్ షోని రక్తి కట్టించాడు. 

“విజయ్‌ దేవరకొండ తమ్ముడు మీకు తెలుసా?ఆయన తన అన్నని ఇమిటేట్ చేస్తాడట కదా?ఎలా యాక్ట్ చేస్తాడు? యావరేజ్ ఆట కదా? బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ యాక్షన్ ఎలా ఉంది? ఆయన నటించిన గంగం గణేశా సినిమా మే 31న రిలీజ్ అవుతోంది మీకు తెలుసా?” అంటూ ఇమ్మానుయెల్ చిలిపి ప్రశ్నలు వేస్తుంటే కారు డ్రైవ్ చేస్తున్నది ఆనంద్ దేవరకొండ అని తెలియక అతని గురించి, అతని నటన, సినిమాల గురించి మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు.

వారు చెప్పడం పూర్తయ్యాక ఆనంద్ దేవరకొండ మొహానికి మాస్క్ తీసి పలకరించడంతో వారు సంతోష పడ్డారు. ఇంత వివరణ దేనికి... ఈ వీడియో మీరే చూడండి. 


Related Post

సినిమా స‌మీక్ష