సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికినష్ట పరిహారం 2.75 కోట్లు

December 04, 2025
img

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 గత ఏడాది విడుదలయినప్పుడు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు నేడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్, ఆయన సోదరుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. 

అల్లు అర్జున్‌ వీరి కుటుంబానికి రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించారు. బాలుడు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు నిమిత్తం అల్లు అర్జున్‌ ఆయన తండ్రి అల్లు అరవింద్ మరో రూ.75 లక్షలు ఇచ్చారు. రెండు కోట్లు ఫిక్స్ డిపాజిట్ చేయగా దానిపై వచ్చే వడ్డీలో నెలకు రూ.75,000 భాస్కర్ ఇంటి ఖర్చులకు, శ్రీతేజ్ వైద్యానికి ఉపయోగిస్తున్నాము. మిగిలిన డబ్బుని మళ్ళీ అసలులో కలిపి మరింత వడ్డీ వచ్చేలా ముందే ఏర్పాటు చేశాము.

శ్రీతేజ్ చాలా వరకు కోలుకున్నాడు. అతనికి మరో ఆరు నెలల పాటు చికిత్స అవసరమని, దానికి వేరేగా ఆర్ధిక సాయం చేయాలని భాస్కర్ కోరారు. మేము అల్లు అర్జున్‌తో మాట్లాడగా ఆయన అంగీకారం తెలిపారు. కానీ అవసరమైతే మరో ఏడాది పాటు అవసరమైన చికిత్స అందించేందుకు అల్లు అర్జున్‌ సాయపడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము,” అని దిల్ రాజు చెప్పారు. 


Related Post