నాకు సానుభూతి వద్దు.. ఇంటర్వ్యూలు అడగొద్దు: శ్యామిలి

December 04, 2025
img

ఇటీవల సమంత-రాజ్ నిడిమోరు పెళ్ళి చేసుకున్నారు. ఇంతకాలం వారి ప్రేమ, ఇప్పుడు పెళ్ళి కబుర్లు చెప్పిన మీడియా ఇప్పుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామిలిని ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. పలువురు ఆమెపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నారు. 

వీటిపై ఆమె స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పెట్టారు. “అందరూ నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ప్రస్తుతం ఇటువంటి విషయాలు పట్టించుకునే పరిస్థితిలో నేను లేను. నా గురువుగారు క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయన కోలుకోవాలని రోజూ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. 

నాకు పీఆర్ టీమ్‌ లేదు. నేనే స్వయంగా నా సోషల్ మీడియా అకౌంట్ మెయింటెయిన్ చేసుకుంటాను. కనుక ఇటువంటి విషయాలపై నేను స్పందించలేను. ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో నా నుంచి బ్రేకింగ్ న్యూసులు, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఆశించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. అందరూ సంతోషంగా జీవించడమే ముఖ్యం. కనుక నా పరిస్థితిని అందరూ అర్ధం చేసుకొని నా ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాను,” అని శ్యామలి మెసేజ్ పెట్టారు. 

Related Post