ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇమ్మడి రవి తెలుగుతో సహా వివిధ భాషలలో విడుదల కాబోతున్న కొత్త సినిమాలను అక్రమ పద్దతుల ద్వారా సంపాదించి వాటిని తన ఐబొమ్మతో సహా పలు వెబ్‌సైట్లకు అమ్ముకొని కోట్ల రూపాయలు గడించినట్లు ఐబొమ్మ రవి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
నాంపల్లి కోర్టు అనుమతితో పోలీసులు అతనిని 5 రోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించి పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు అతనిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు అతనిని చర్లపల్లి జైలుకి తరలించారు.
ఇది కాక పోలీసులు వేరేగా మరో మూడు కేసులు అతనిపై నమోదు చేశారు. వాటి గురించి ప్రశ్నించేందుకు మళ్ళీ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులోనే వేరేగా పిటిషన్లు వేశారు. కోర్టు అనుమతిస్తే మళ్ళీ అతనిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తారు.