ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో వడోదర జిల్లాలో గంభీర్ నదిపై వంతెన కూలిపోయింది. ఆ దానిపై ప్రయాణిస్తున్న ట్రక్కులు, ఇతర వాహనాలు నదిలో పడిపోయాయి.
ఈ ప్రమాదంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెన కూలిపోయిన ఈ వార్త, ప్రమాదంలో 16 మంది చనిపోవడం దేశమంతటా మారుమ్రోగిపోయింది. ప్రధాని మోడీ విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు ఈ వంతెన కూలిపోవడంతో విదేశీ మీడియా కూడా ఈ వార్తని ప్రచురిస్తోంది. ఇది ప్రధాని మోడీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే!
కానీ ఆర్&బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పక తప్పదు. 1986లో నిర్మించబడిన ఈ వంతెన చాలా ప్రమాదకరంగా ఉందని, కనుక దానిని కూల్చేయాలని లేదా కనీసం అంతవరకు ఆ వంతెనని మూసి వేయాలని వడోదర జిల్లా పంచాయత్ సభ్యుడు హర్షద్ సింగ్ సిన్హా పర్మార్ 2022, ఆగస్టులో ఒకసారి మళ్ళీ 2022 అక్టోబరులో మరోసారి లేఖలు వ్రాసి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. కనుకనే వంతెనపై వాహనాలు తిరుగుతున్నాయి. అవి తిరుగుతుండగానే వంతెన కూలిపోయింది. దీనికి ఇప్పుడు అందరూ ప్రధాని మోడీని వేలెత్తి చూపిస్తున్నారు.