ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ చేర్చారు. కానీ ఆయనకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని లేకుంటే ప్రాణానికే ప్రమాడమని వైద్యులు తేల్చి చెప్పేశారు.
కనుక ఆయన కుమార్తె స్రవంతి సోషల్ మీడియా ద్వారా సినీ పరిశ్రమలో వారికి, రాజకీయ నాయకులకు తమ ఆర్ధిక పరిస్థితి, తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరించి సాయం కోసం అర్ధించారు.
ముందుగా రెబెల్ స్టార్ ప్రభాస్ తరపున ఆయన పీఏ నుంచి ఆమెకు మొన్న ఫోన్ వచ్చింది. ఆపరేషన్‌కు రూ.50 లక్షలు సాయం ప్రభాస్ అందిస్తారని ధైర్యంగా ఉండమని చెప్పారు. అప్పటి నుంచి దాని కోసం వారు ఎదురుచూస్తున్నారు. కానీ డబ్బు రాకపోవడంతో ప్రభాస్ పీఏకు తిరిగి ఫోన్ చేశామని, కానీ తమ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని చెప్పారు. ప్రభాస్ 50 లక్షలు సాయం చేస్తారని మీడియాలో వార్తలు రావడంతో సాయం చేసేందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక దాతలు సాయం చేసి తమ తండ్రి ప్రాణం కాపాడాలని స్రవంతి విజ్ఞప్తి చేశారు.
#Prabhas𓃵 పీఏ అంటూ కాల్ చేసి వివరాలు తీసుకున్నారు.. కానీ ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తుంటే ఎవరు లిఫ్ట్ చేయడం లేదు
— greatandhra (@greatandhranews) July 5, 2025
ఫేక్ కాల్స్‌తో కాలయాపన చేసే సమయం లేదు.. సాయం చేసేవాళ్లు ఎవరైనా ఉంటే సాయం చేయండి అంటూ వేడుకున్న యాక్టర్ ఫిష్ వెంకట్ కూతురు. pic.twitter.com/cLyXFEryRE