ఫిష్ వెంకట్ శస్త్ర చికిత్సకు ప్రభాస్‌ 50 లక్షలు!

July 04, 2025
img

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆయన రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇంత కాలం డయాలసిస్ చేసుకుంటూ ప్రాణం కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తే తప్ప ఆయన జీవిచడం కష్టమేనని వైద్యులు తేల్చి చెప్పేశారు.

ఫిష్ వెంకట్ అనేక సినిమాలలో నటించినప్పటికీ, కిడ్నీలు చెడిపోయినప్పటి నుంచి ఆయన ఆర్ధికస్థితి తారుమారు అయిపోయింది. అనారోగ్యం కారణంగా సినిమాలు కూడా చేయలేకపోయారు. కనుక ఆదాయం కూడా లేదు. 

ఈ పరిస్థితిలో అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకోవడం అసంభవమే. ఆయన కుమార్తె స్రవంతి సోషల్ మీడియా ద్వారా సినీ పరిశ్రమలో వారికి, రాజకీయ నాయకులకు తమ ఆర్ధిక పరిస్థితి, తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరించి సాయం కోసం అర్ధించారు. 

అందరి కంటే ముందుగా రెబెల్ స్టార్ ప్రభాస్‌ స్పందించారు. ఆయన మేనేజర్ ఈరోజు ఆమెకు ఫోన్‌ చేసి ఆపరేషన్‌కు అయ్యే రూ.50 లక్షలు ప్రభాస్‌ అందిస్తారని ధైర్యంగా ఉండమని చెప్పారు.

ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి కిడ్నీ దానం చేసేందుకు సిద్దంగానే ఉన్నారు. కనుక డబ్బు చేతికి రాగానే వెంటనే ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Related Post