అహ్మదాబాద్‌ ప్రమాదంపై వెరైటీగా వర్మ స్పందన

June 13, 2025
img

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “భగవంతుడు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలుసు?” అని హెడ్డింగ్ పెట్టి, “ఓ అందమైన పర్యాటక ప్రదేశానికి (పహల్గాం) వెళ్తే ఉగ్రవాదులు కాల్చి చంపేస్తారు. ఓ ట్రోఫీ (ఐపిఎల్)  గెలుచుకొని పండుగ చేసుకుందామనుకుంటే త్రొక్కిసలాటలో చనిపోతాము. హాస్టల్లో (అహ్మదాబాద్‌లో జేబీ వైద్య కళాశాల హాస్టల్) భోజనం చేస్తుంటే నెత్తిపై విమానం కూలిపోవచ్చు,” అని వర్మ ట్వీట్ చేశారు.  ఈ మూడు విషాద ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా జరిగినవే. అయితే అన్నిటినీ కలిపి చూసి ఈవిదంగా చెప్పగల నేర్పు రాంగోపాల్ వర్మకు మాత్రమే ఉంది. ఆయన చెప్పింది వెరైటీగా ఉన్న వాస్తవమే అని అందరికీ తెలుసు. 

Related Post