నిన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంబందించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ కోమీ వ్యాస్ కుటుంబం కూడా ఒకటి. డాక్టర్ కోమీ వ్యాస్ కొంతకాలం క్రితం లండన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇటీవలే లండన్ నుంచి వచ్చి భార్య డాక్టర్ ప్రతీక్ జోషీ, కుమార్తె మీరియా (8), ఇద్దరు కవల కుమారులు ప్రధ్యుత్, నకుల్ (5)లను తీసుకొని మళ్ళీ లండన్ బయలుదేరారు.
విమానం బయలుదేరే ముందు వారందరూ చాలా సంతోషంగా సెల్ఫీలు తీసుకొని వాటిని తమ బంధుమిత్రులకు పంపారు. బంధు మిత్రులు కూడా వారిని అభినందిస్తూ మెసేజ్‌లు పెట్టారు. కానీ వారి లండన్ కలలు రన్‌వే అవతలే అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఈ విమాన ప్రమాదంలో వారందరూ చనిపోయారు.
ఈ విమాన ప్రమాదంలో 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు, విమానం కూలడంతో హాస్టల్లో 24 మంది వైద్య విద్యార్ధులు చనిపోయారు.
ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. ఆయన లండన్‌లో ఉంటున్న తన భార్య, కుమార్తెల వద్దకు బయలుదేరి ఈ ప్రమాదంలో చనిపోయారు.