ట్రాఫిక్ జామ్ అయితే దానిలో చిక్కుకుపోయి అందరూ తిట్టుకుంటారు. కానీ నిన్న ట్రాఫిక్ జామ్ కారణంగానే ఓ మహిళ ప్రాణాలతో బతికి బయటపడింది.
భూమీ చౌహాన్ అనే మహిళ నిన్న అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్ వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ఇంటి నుంచి కారులో విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు, విమానాశ్రయం సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ఆమె విమానం అందుకోలేకపోయారు.
“ఇక చేసేదేమీ లేక తీవ్ర నిరాశతో విమానాశ్రయం నుంచి ఇంటికి బయలుదేరుతుంటే, విమానం కూలిపోయిందనే వార్త విని షాక్ అయ్యాను. ఆ విమానంలో అందుకొని ఉండి ఉంటే నేను కూడా చనిపోయి ఉండే దానిని కదా?అని తలుచుకునే వెన్నులో వణుకు పుట్టింది. కాసేపు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నన్ను ఆ గణపతి బప్పాయే కాపాడాడు. ఆయనకు శతకోటి వందనాలు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకి సంతాపం, సానుభూతి,” అని భూమీ చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది.