ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత పెళ్ళిలో ఆయన పుష్ప-2 సినిమాలో ‘సూసేకి..’ పాట (హిందీ వెర్షన్)కు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.
హర్షిత తన స్నేహితుడు సంభవ్ జైన్‌ని ప్రేమించగా ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ కపూర్తలా హౌస్‌లో ఘనంగా వారి పెళ్ళి జరిగింది.
వారి పెళ్ళి వేడుకకు అత్యంత సన్నిహిత బంధుమిత్రులను, ఆమాద్మీ ముఖ్యనేతలు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ దంపతులు పుష్ప-2లో పాటకి డాన్స్ చేయగా, భగవంత్ మాన్ దంపతులు సాంప్రదాయ పంజాబీ దుస్తులలో ఓ పాపులర్ పంజాబీ పాటకు డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆదివారం వివాహ రెసిప్షన్‌కు పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులని ఆహ్వానించారు.
సంభవ్ జైన్ ఐఐటి ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. అప్పుడే హర్షితతో పరిచయం అయ్యి ప్రేమగా మారింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇద్దరూ వేర్వేరు ప్రైవేట్ కంపెనీలలో అసోసియేట్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. పెద్దల ఆమోదంతో పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.