ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్‌ని హైదరాబాద్ తీసుకువచ్చారు. సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్న ఆ బాలుడు ఇటీవల తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్పంగా గాయపడగా సింగపూర్‌లో స్థానిక హాస్పిటల్‌లో మూడు రోజులు చికిత్స పొంది కోలుకున్నాడు.
కానీ ఈ సమయంలో అతనికి తల్లి తండ్రుల అవసరం చాలా ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ దంపతులు అతనిని తమతో బాటు హైదరాబాద్ తీసుకువచ్చారు. సింగపూర్‌లో కూడా పాఠశాలలకు వేసవి సెలవులు మొదలయ్యి ఉంటే మార్క్ శంకర్ సెలవులు పూర్తయ్యేవరకు హైదరాబాద్‌లో తల్లి తండ్రులతో కలిసి ఉంటాడు. ఒకవేళ వారు తమ కుమారుడిని హైదరాబాద్‌లోనే చదివించాలనుకుంటే ఇక్కడే ఉండిపోయే అవకాశం ఉంది.