ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం జరిగి నెల రోజులైంది. ఇన్ని రోజుల తర్వాత నేడు సొరంగంలో ప్రమాదం జరిగిన చోటికి కొంత దూరంలో దుర్వాసన వస్తుండటంతో ఆ ప్రాంతంలో రోబో సాయంతో తవ్వి చూడగా మరో మృతదేహం బయటపడింది. అయితే ఇప్పటికే పూర్తిగా కుళ్ళిపోయినందున, ఏదైనా గుర్తింపు కార్డు లభిస్తే తప్ప గుర్తించడం కష్టమే. అప్పుడు డీఎన్ఏ పరీక్ష చేసి చనిపోయిన వ్యక్తి ఎవరి బంధువో తెలుసుకోవలసివస్తుంది. ఈ రోజు సాయంత్రంలోగా మృతదేహాన్ని వెలికితీయవచ్చని సమాచారం.
ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో మొత్తం 8 మంది చనిపోగా ఇప్పటి వరకు ఓకే ఒక్క వ్యక్తి మృతదేహం వెలికి తీయగలిగారు. ఈ ప్రమాదంలో టన్నల్ బోరింగ్ మెషిన్ కూడా ధ్వంసం అయ్యింది. ప్రమాద స్థలానికి చేరుకోవడానికి అది అడ్డుగా ఉండటంతో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేయాల్సి వచ్చింది.
కనుక మళ్ళీ సొరంగం తవ్వకం పనులు చేపట్టాలంటే వందల కోట్లు ఖర్చు చేసి విదేశం నుంచి కొత్త యంత్రం కొనుగోలు చేయాల్సిందే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే చెపుతున్నందున అంత ఖర్చు చేస్తారో లేదో?