ఫన్ బకెట్ భార్గవ్‌గా మంచి గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబర్‌కి విశాఖ జిల్లా కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. తనతో పాటు యూ ట్యూబ్, టిక్ టాక్ వీడియోలు చేసే 14 ఏళ్ళ బాలికని మాయ మాటలతో వశపరుచుకొని ఆ తర్వాత ఆమెని బెదిరించి భయపెడుతూ పదేపదే అత్యాచారం చేశేవాడని విశాఖలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు కొన్ని రోజుల క్రితం పిర్యాదు చేసింది.
అతని వలన ఆమె గర్భం కూడా దాల్చడంటో ఏసీపీ జి.ప్రేమ్ కాజల్ దీనిని తీవ్రంగా పరిగణించి వెంటనే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత లోతుగా విచారణ జరిపి అతను ఈ నేరానికి పాల్పడిన్నట్లు అన్ని సాక్ష్యాధారాలతో ఛార్జ్-షీట్ ఫైల్ చేసి విశాఖ జిల్లా కోర్టుకి సమర్పించారు. వాటిని నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి ఫన్ బకెట్ భార్గవ్‌ని దోషిగా నిర్ధారించి 20 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. అతని వలన గర్భవతి అయిన బాలికకు రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.