జనగామలో భారీ అగ్నిప్రమాదం

October 27, 2024
img

జనగామ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. సిద్ధిపేట రోడ్డువైపు గల విజయ వస్త్ర దుకాణంలో మంటలు మొదలయ్యి పక్కనే ఉన్న శ్రీలక్ష్మి వస్త్ర దుకాణానికి వ్యాపించాయి. వాటి పక్కనే ఉన్న మరో దుకాణాలు కూడా అగ్నికి ఆహుతి ఆయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి, జనగామ నుంచి అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని సుమారు గంటసేపు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఈ సమాచారం అందుకున్న జనగామ సీఐ దామోదర్ రెడ్డి పోలీసులను వెంటబెట్టుకొని అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని దామోదర్ రెడ్డి చెప్పారు. 

దసరా, దీపావళి పండుగల కోసం భారీగా స్టాక్ తెప్పించామని, అదంతా అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోయిందని,  తమ షాపులు, వాటిలో షోకేసులు, తదితర సామాను అంతా కాలి బూడిదైపోయాయని శ్రీలక్ష్మి, విజయ వస్త్ర దుకాణాల యజమానులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ అగ్నిప్రమాదం వలన సుమారు రూ.10 కోట్లు నష్టం వచ్చిందని వారు తెలిపారు. 

Related Post