నిజామాబాద్‌లో ఓ మునిసిపల్ అధికారి ఇంట్లో సోదాలు చేయగా ఏకంగా రూ.2.93 కోట్లు నగదు పట్టుబడింది. మునిసిపల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న దాసరి నరేందర్ అవినీతికి పాల్పడుతున్నట్లు పిర్యాదులు అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
ఆయన ఇంట్లో పట్టుబడినది కాక ఆయన భార్య, తల్లి బ్యాంక్ ఖాతాలలో మరో 1.10 కోట్లు కనుగొన్నారు. ఇదికాక 51 తులాల బంగారు ఆభరణాలు కనుగొన్నారు. సుమారు రూ.1.98 కోట్లు విలువ కలిగిన ఇళ్ళు, ఫ్లాట్స్, స్థలాలు ఉన్నట్లు కనుగొన్నారు. అవి బయట మార్కెట్ విలువ ప్రకారం కొన్ని వందల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేశారు.
సోదాలు కొనసాగుతున్నకొద్దీ నోట్ల కట్టలు బయటపడుతూనే ఉండటంతో, వాటిని లెక్కించేందుకు అప్పటికప్పుడు మెషిన్లు తెప్పించాల్సి వచ్చింది. దాసరి నరేందర్ బినామీలు, బంధుమిత్రుల పేర్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన్నట్లు సమాచారం. అవినీతిశాఖ అధికారులు దాసరి నరేందర్‌ని అదుపులో తీసుకొని వాటి గురించి ప్రశ్నిస్తున్నారు.
దాసరి నరేందర్ జీతం సుమారు లక్ష రూపాయలు ఉందని కానీ ఆయన వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు కనుగొన్నామని అధికారులు చెప్పారు.