జూన్ 8న హైదరాబాద్‌లో చేప మందు పంపిణీ

May 21, 2024
img

బత్తిని సోదరులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మృగశిర కార్తేలో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయబోతున్నారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, జూన్ 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 11 గంటల వరకు 24 గంటలపాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ చేస్తామని చెప్పారు.

ఆ తర్వాత మరో రెండు రోజుల పాటుదూద్ బౌలీలోని తమ నివాసం వద్ద చేప మందు పంపిణీ చేస్తామని చెప్పారు. కనుక మూడు లక్షల చేప పిల్లలను సిద్దం చేసి అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఎప్పటిలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అవసరమైన ఏర్పట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ చేప మందు కోసం ఏటా దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు వస్తుంటారు. కనుక జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్, అగ్నిమాపక, తదితర శాఖలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంటాయి.

హైదరాబాద్‌లో ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం దశాబ్ధాలుగా సాగుతోంది. కరోనా మహమ్మారి విజృంభించిన రెండేళ్ళలో తప్ప ఎన్నడూ ఆటంకం ఏర్పడలేదు. కనుక ఈసారి కూడా సజావుగానే సాగుతుందని అందరూ ఆశిస్తున్నారు.

Related Post