అయ్యో! కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం!

February 03, 2023
img

కొత్తగా నిర్మించబడుతున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇంకా ప్రారంభోత్సవం కాక మునుపే అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయంలోని మొదటి అంతస్తులో విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు అంటుకొన్నాయి. సచివాలయం చుట్టూ భారీ పొగలు కమ్ముకోవడం చూస్తే అగ్నిప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నట్లనిపిస్తుంది. సమాచారం అండగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడ్కి చేరుకొని 11 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ నెల 17వ తేదీన సిఎం కేసీఆర్‌ పుట్టినరోజునాడు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తు, ముహూర్తాలని ఎంతగానో నమ్మే సిఎం కేసీఆర్‌ భూమి పూజ చేసినరోజు నుంచి అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడా వాస్తు దోషాలు లేకుండా దగ్గరుండి సచివాలయాన్ని నిర్మింపజేసుకొన్నారు. కానీ ప్రారంభోత్సవానికి ముందు అగ్నిప్రమాదం జరగడంతో ఆయన ఏవిదంగా స్పందిస్తారో?         


Related Post