విజయ్‌ దేవరకొండకి సైడ్ ఎఫెక్ట్స్... ఏవిటో?

December 01, 2022
img

లైగర్‌ సినిమా నష్టాల గురించి అందరికీ తెలిసిందే. అవి సరిపోవన్నట్లు ఈడీ కష్టాలు మొదలయ్యాయిప్పుడు. ఆ సినిమాకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరు ఎతెంత పెట్టారు?దుబాయి నుంచి పెట్టుబడులు ఎందుకు వచ్చాయి? వాటిని ఎవరు పంపారు? అలా ఎందుకు పంపారు? అని ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే ఆ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలలో ఒకరైన ఛార్మీని ఈడీ ప్రశ్నించారు. లైగర్‌లో హీరోగా నటించిన విజయ్ దేవరకొండని కూడా ఈడీ నిన్న సుదీర్గంగా ప్రశ్నించింది. అనంతరం ఆయన మీడియాని ఎదుర్కోవలసి వచ్చింది. ఈడీ విచారణపై వారు అడిగిన ప్రశ్నలకు విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ, “పేరు, పాపులారిటీతో పాటు కొన్ని కొత్త సమస్యలు, సవాళ్ళు కూడా వస్తాయి. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇదీ అటువంటిదే అని భావిస్తున్నాను,” అని చెప్పి వెళ్ళిపోయారు. 

విజయ్ దేవరకొండని ఈడీ అధికారులు ఏం ప్రశ్నించారో తెలీదు కానీ అతనికి ఇదో కొత్త అనుభవం... గుణపాఠం అని గ్రహించినట్లే ఉన్నారు. సినిమాలు ఫ్లాప్ అవడం... మళ్ళీ నిలద్రొక్కుకోవడం విజయ్ దేవరకొండ ఇప్పటికే నేర్చుకొన్నాడని చెప్పవచ్చు. కానీ ఆర్ధిక లావాదేవీల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నష్టపోవడమే కాకుండా ఇటువంటి తీవ్ర పరిణామాలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని విజయ్ దేవరకొండ గ్రహించినట్లే ఉన్నారు. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అన్నాడు.

Related Post