రష్మిక మందన యానిమల్ సినిమాతో అందాల ప్రదర్శన, హీరోలతో లిప్‌లాక్స్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసుపోనని నిరూపించి చూపడం ‘నేషనల్ క్రష్’ అయిపోయింది. అప్పటి నుంచి ఆమెకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. తాజాగా ఆమె చేసిన హర్రర్ కామెడీ సినిమాలో ‘తమ’లో తగ్గేదేలే అని తేల్చిచెప్పేసింది. కొద్ది సేపటి క్రితం విడుదల ‘తమ’ ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన, పరేష్ రావెల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రలు చేశారు.
ఆదిత్య సర్పొట్దార్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు కధ: నీరెన్ భట్, సురేష్ మాథ్యూ, అమర్ కౌశిక్; సంగీతం: సచిన్-జిగర్; కెమెరా: సౌరభ్ గోస్వామి చేశారు.
మాడ్ దర్శకత్వంలో ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి పండుగకు విడుదల కాబోతోంది.