రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కానీ ఆ తర్వాత అనేక ‘హిట్స్’ కొట్టి తనకంటూ ‘మెగా పవర్ స్టార్’ అనే ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో అంత గుర్తింపు లభిస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు
సినీ పరిశ్రమలో ప్రవేశించి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది టీమ్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వేసింది, వీపున పెద్ద బ్యాగ్ తగిలించుకొని రైలు పట్టాలపై నిలబడి బీడీ కాల్చుతున్న ఆ ఫోటోలో ‘పెద్ది’ వరకు చేరుకున్నట్లు చూపడం చాలా బాగుంది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ క్రికెట్ ఆటగాడిగా నటిస్తుంటే, ఆయనకు కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
పెద్ది సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిందని ముందుగా ప్రకటించినట్లుగానే 2026, మార్చి 27న ఈ సినిమా విడుదలవుతుందని రత్నవేలు చెప్పారు. నేడు విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్లో కూడా ఇదే ధ్రువీకరించారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.

18 YEARS OF “MEGA POWER STAR” IN CINEMA ❤🔥

From the most awaited debut to one of the most celebrated actors, your journey in cinema has been sensational @AlwaysRamCharan Sir ❤️
I'm so happy to be a part of this incredible journey Sir ❤️🤗🙏

Dear @AlwaysRamCharan fans, #Peddi… pic.twitter.com/QCLQFCRGqt
— BuchiBabuSana (@BuchiBabuSana) September 28, 2025