సూపర్ డూపర్ హిట్ బాహుబలి సినిమాలో బాహుబలి, బల్లాల దేవలతో సమానంగా చాలా పాపులర్ అయిన పాత్ర కట్టప్ప. ఈ పాత్రతో సత్యరాజ్ చాలా పాపులర్ అయిపోయారు. యావత్ దేశ ప్రజలకు ఆయన పేరు సుపరిచితులయ్యారు.
కట్టప్ప అంటే విశ్వాసానికి మారుపేరు... అలాంటి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే చర్చ బాహుబలి-2 వచ్చే వరకు సాగింది. కానీ ఎవరూ ఊహించలేకపోయారు. అప్పటి నుంచే రాజకీయాలలో వెన్నుపోటు పొడిచేవారిని కట్టప్ప అనడం కూడా ప్రారంభమైంది.
ఇలా విశ్వాసానికి మారుపేరుగా నిలిచినా ఒక పాత్ర అందుకు పూర్తి విరుద్దమైన ‘వెన్నుపోటుదారు’ అనే ఇమేజ్ కూడా వచ్చేలా చేయడం రాజమౌళికే చెల్లునేమో? కానీ ఆ పాత్రని సృష్టించింది ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని అందరికీ తెలుసు.
బాహుబలి-2 తర్వాత అందరూ కట్టప్పని మరిచిపోయారు. కానీ అయన మాత్రం మరిచిపోలేదు. అసలు కట్టప్ప పూర్వ చరిత్ర ఏమిటి? అతనికి మాహిష్మతి సామ్రాజ్యంతో ఏవిదంగా సంబంధం ఏర్పడింది. అంతటి వీరాధివీరుడైన కట్టప్ప జీవితాంతం మాహిష్మతి ప్రభువులకు బానిసలా, సేవకుడిలా ఎందుకు ఉండిపోయారు?బల్లాలదేవుడు వంటివారు అంతగా ఈసడించుకుంటున్నా అంత వినయంగా ఎందుకు భరించారు?వంటి ప్రశ్నలు చాలా మందికే కలిగి ఉండవచ్చు.
వాటన్నిటికీ సమాధానాలు చెప్పేందుకు విజయేంద్ర ప్రసాద్ ‘కట్టప్ప’ అనే మరో సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29తో లాక్ అయిపోయారు. కనుక ‘కట్టప్ప’ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా వివరాలు ప్రకటించబోతున్నట్లు సమాచారం.