అమెజాన్ ప్రైమ్‌ వీడియో లో మదరాసీ..

September 26, 2025
img

మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ‘మదరాసీ’ అదే పేరుతో తెలుగులో సెప్టెంబర్‌ 5న విడుదలై పరవాలేదనిపించుకుంది. ఇప్పుడీ సినిమా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కాబోతోంది. 

తమిళనాడులో అమెరికాలా తుపాకీ సంస్కృతి ప్రవేశపెట్టాలనే కొత్త పాయింట్‌తో దర్శకుడు ఈ కధ వ్రాసుకొని, తన పద్దతిలో అవసరమైన రొమాన్స్ జోడించి మంచి యాక్షన్ మూవీగా మలిచారు. ఈ సినిమాలో విద్యుత్ జమ్మవల్, బిజూ మీనన్, విక్రాంత్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌.శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఏఆర్. మురుగదాస్; సంగీతం: అనిరుద్ రవిచంద్రన్: కెమెరా: సుదీప్ ఎలామన్ చేశారు. 

Related Post