అనగనగా ఒక రాజు… 24 క్యారెట్స్ బంగారం!

September 26, 2025
img

మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంని తెలియజేస్తూ ఇప్పటికే ఓ వీడియో వదిలారు.

మళ్ళీ తాజాగా సంక్రాంతి ప్రమోషన్స్‌ అంటూ మరో వీడియోని ఓజీ సినిమా ప్రదర్శించబోతున్న థియేటర్లలో వదిలారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది.

దానిలో మీనాక్షి చౌదరి బంగారు ఆభరణాలు ధరించి సినిమా గురించి మాట్లాడమంటే వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నట్లు డైలాగ్స్ చెప్పడం, అప్పుడు నవీన్ శెట్టి వచ్చి ఆమెకు ఇది మన సినిమా ప్రమో అని గుర్తు చేయడం కానీ మళ్ళీ ఆమె అలాగే బంగారు నగల గురించి మాట్లాడుతుండటం, అప్పుడు నవీన్ పోలిశెట్టి ఆ ఆభరణాలు ధరించి ఆమె చేత అనగనగా ఒక రాజు సినిమా గురించి చెప్పించి, ముగింపులో అతను కూడా బంగారు ఆభరణాల గురించి మాట్లాడటం... ప్రమో చాలా వెరైటీగా ఉంది.     

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేశారు. 

Related Post