క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రం ప్రభు ప్రధాన పాత్రలలో నటించిన ఘాటి సినిమా భారీ అంచనాలతో ఈ నెల 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క నటన చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కానీ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడీ సినిమా గురువారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత చేసిన ఈ సినిమాపై అనుష్క శెట్టి కూడా చాలా ఆశాపెట్టుకున్నారు. కానీ నెగెటివ్ టాక్ వచ్చి సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్ర నిరాశ చెందారు. (ఈ విమర్శలు భరించలేక) కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు చాలా బలమైన కధ, పాత్రలే వ్రాసుకున్నారు. కానీ గంజాయి రవాణా చుట్టూ తిరిగే కధ ప్రేక్షకులకు ఎక్కలేదు. నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొని దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. కానీ దాని వలన కూడా వారు మరింతగా నష్టపోయారు.