లిటిల్ హార్ట్స్ ట్రైలర్... చూసి తీరాల్సిందే!

August 31, 2025
img

సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం జంటగా చేస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ టీజర్‌తోనే అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే మరోసారి చూడాలనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమలు... చిలిపి కబుర్లు, ఇంట్లో తల్లితండ్రులు, కాలేజీలో లెక్చరర్లు రోజూ ఇద్దరికీ చివాట్లు, ఆ డైలాగులు అన్నీ అద్భుతంగా కుదిరాయి. “మీలో ఎంసెట్ చేయాలనుకునేవారు వీళ్ళిద్దరికీ దూరంగా ఉండండి...” అనే లెక్చరర్ ఒక్క డైలాగ్ ఈ సినిమాలో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో చెపుతోంది. 

ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య కృష్ణ, ఎస్ఎస్ కంచి, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

 ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయి మార్తాండ్ , సంగీతం: సంజిత్ ఎర్రమిల్లి, కెమెరా: సురియా బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి చేస్తున్నారు. 

బన్నీ వాసు, వంశీ నందిపాటి ఎంటర్టెయిన్మెంట్ సమర్పణలో విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మిస్తున్న లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Related Post