మళ్ళీ చాలా రోజుల తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ ‘మకుటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విశాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఈరోజు వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఓ రౌడీ, ఓ బిజినెస్ మ్యాన్, ఓ ఉద్యోగి మూడు వేర్వేరు రూపాలలో చూపారు. కనుక ఈ సినిమాలో విశాల్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు భావించవచ్చు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రవి అరసు; డైలాగ్స్: రాజేష్ ఏ మూర్తి; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్; కెమెరా: రిచర్డ్ ఎమ్మెల్యేలు మదన్, ఆర్ట్: జి.దూరి రాజ్; ఎడిటింగ్: ఎన్బీ శ్రీకాంత్; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే ముగిసింది. త్వరలో మూడో షెడ్యూల్ మొదలుపెడతామని విశాల్ తెలిపారు.