మహేష్ అభిమానులూ... కాస్త ఓపిక పట్టండి ప్లీజ్!

August 09, 2025
img

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బాబు పుట్టిన రోజు. కనుక తప్పకుండా ఎస్ఎస్ఎంబీ29 సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తారని అభిమానులు ఆశించారు. అప్‌డేట్ ఇవ్వలేదు కానీ కాస్త ఓపిక పట్టమంటూ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 

ఇంతకీ రాజమౌళి ఏం చెప్పారంటే, “భారత్‌ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరికీ,

అలాగే మహేష్ అభిమానులకు,  ఓ విజ్ఞప్తి: మేము షూటింగ్ ప్రారంభించి కొంతకాలం అయింది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మీరందరూ ఆత్రుతటగా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు.

అయితే, ఈ సినిమా కథ, స్థాయి చాలా విస్తృతంగా ఉన్నందున ఏదో కొన్ని ఫొటోలు పెడితే లేదా ప్రెస్‌మీట్‌ పెట్టి ఎదో చెప్పినంత మాత్రాన్న అవి ఈ సినిమాకు న్యాయం చేయలేవని భావిస్తున్నాను.

ప్రస్తుతం మేము రూపొందిస్తున్న ఈ సరికొత్త ప్రపంచ అనుభూతి, దాని లోతు, స్థాయిని తెలియజేస్తూ మీకు అందించడానికి ప్రత్యేకంగా ఏదో సిద్ధం చేస్తున్నాము. ఈ నవంబర్‌లో అది ఆవిష్కరించబోతున్నాము. అది మునుపెన్నడూ చూడని విధంగా చాలా గొప్పగా ఉండేలా తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నాము. కనుక అంతవరకు అందరూ ఓపిక పట్టాలి. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు... ఇట్లు ఎస్‌.ఎస్‌. రాజమౌళి” అని ట్వీట్ చేశారు. 

కానీ మహేష్ బాబు అభిమానుల కోసం ఓ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో మహేష్ బాబు మెడలో నల్లపూసల గొలుసు... దానికే వ్రేలాడుతూ శివుడి బొట్టు, త్రిశూలం, డమరుకం, నందీశ్వరుడు బొమ్మలున్నాయి. రక్తం అంటుకొని ఎర్రగా మారిన మహేష్ బాబు ఛాతిని చూపారు. 


Related Post