జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన?

November 06, 2025


img

ఈ నెల 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, 14న ఫలితాలు రాబోతున్నాయి. ఈ హడావుడి ముగిసిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన చేయబోతున్నారని, ఇందుకు కాంగ్రెస్‌ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నలుగురు మంత్రులను తొలగించి వారి స్థానంలో వేరే వారిని తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వాటి ప్రకారం తరచూ వివాదాస్పద వ్యాక్యాలు చేస్తూ ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెడుతున్న మంత్రి కొండ సురేఖని తప్పించి ఆమె స్థానంలో విజయశాంతిని తీసుకోవచ్చని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తప్పించి ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ని పీసీసీ అధ్యక్షుడుగా నియమించి మహేష్ కుమార్ గౌడ్‌ని ఆయన స్థానంలోకి తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావుని తప్పించి ఆయన స్థానంలో మల్ రెడ్డి రంగారెడ్డిని తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినట్లయితే, వెంటనే ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గెలిస్తే కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఈసారి మంత్రి వర్గ ప్రక్షాళన తప్పదని తెలుస్తోంది.


Related Post