తెలంగాణ ఈగల్ టీమ్‌ విశాఖలో అరెస్టులు

November 02, 2025


img

మాదక ద్రవ్యాలను వాడకం, సరఫరా చైన్‌ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఏర్పాటు చేయబడిన తెలంగాణ ఈగల్ టీమ్‌ తొలిసారిగా విశాఖపట్నంలో అరెస్టులు చేసింది. బెంగళూరు నుంచి దూరంతో ఎక్స్‌ప్రెస్‌లో చరణ్ అనే యువకుడు డ్రగ్స్ తీసుకొని విశాఖకు వస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీమ్‌, విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి అతన్ని విశాఖ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్‌ చేసింది. అతని వద్ద నుంచి నిషేదిత ఎల్‌ఎఎస్‌డీ డ్రగ్స్ 36 స్ట్రిప్స్ ఈగల్ టీమ్‌ స్వాధీనం చేసుకోండి. అతనిని ప్రశ్నించగా విశాఖలో వైసీపీ స్టూడెంట్స్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డికి ఈ డ్రగ్స్ ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. పోలీసులు అతనిని కూడా అరెస్ట్‌ చేశారు. 

ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుడు పేరు పైకి రావడంతో అప్పుడే ఏపీలో అధికారం టీడీపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అనచివేస్తుంటే, వైసీపీ నేతలు బెంగళూరు నుంచి తెప్పించుకొని స్థానిక యువతకు అలవాటు చేస్తున్నారని టీడీపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. 


Related Post